Raja Singh: ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో షో చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. వేదిక దగ్గరే మునావర్‌పై దాడి చేస్తామని అన్నారు. శుక్రవారం మునావర్ షోపై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటాం. ఇప్పటికే మా కార్యకర్తలు ఆల్‌లైన్‌లో షో టిక్కెట్లు తీసుకున్నారు. వేదిక దగ్గరే మునావర్‌పై దాడి చేస్తాం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలి. బీజేపీ నేతలు వద్దన్నా నేను షోను అడ్డుకుని తీరతాను. ధర్మం కన్నా నాకు పార్టీ ముఖ్యం కాదు.
హిందూ దేవుళ్లను కించపరిచే షోలకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. మునావర్ షో జరిగితే జవాబు కూడా చాలా గట్టిగానే ఉంటుంది. నావల్ల ఇప్పటి వరకు శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు’’ అని అన్నారు. రాజాసింగ్ ఆందోళన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తం అయింది. రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసింది. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరి, మునావర్ ఫారుఖీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్.. అసలేం జరిగిందంటే?