వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం జరిగింది. తాజాగా సికింద్రాబాద్-నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా ఖమ్మంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ రైలుకు తరచు ప్రమాదాలు చోటు చేసుంటున్నాయి. గతంలోనే అనేకసార్లు ఈ రైలు గేదెలను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఖమ్మంలో జరిగిన ఈ ఘటనతో రైలు ముందు భాగంగా దెబ్బతినింది. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి.
తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలు దేరింది. ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ కు రాగానే ట్రాక్ పై సడెన్ గా ఓ ఎద్దు వచ్చింది. దీంతో ఆ రైలు ఎద్దును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగక పోగా, రైలు మందు భాగం పాక్షికంగా దెబ్బతినింది. దీంతో అధికారులు ఆ ఎక్స్ ప్రెస్ ను అక్కడే నిలిపివేసి వెంటనే స్థానిక రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు మరమ్మత్తులు చేశారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ వరుస ప్రమాదాలకు చోటు చేసుకోవడంపై మీరెలా స్పందిస్తారు? అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.