ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో బిజీగా ఉంటున్నారు. అందులోనూ వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కస్టమర్ల వాట్సాప్ వినియోగాని దృష్టిలో ఉంచుకోని ఆ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకవస్తోంది. అలా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ ను తీసుకువచ్చింది. సాధారణంగా పలు ప్రైవసీల కారణంగా మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. కానీ కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఈజీగా కనిపెట్టవచ్చు.
మాములుగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. మనకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమల్ని బ్లాక్ చేయనట్లే. ఒక వేళ కనిపించకపోతే మాత్రం మరో రెండు ఆఫన్ష్ లను చెక్ చేయాలి. అవి ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ ఆన్ లైన్ సీన్ స్టేటస్ చెక్ చేయాలి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. వారు ఆన్ లైన్ లో ఉన్నా కూడా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.
మీరు పెట్టిన ఏదైనా మేసేజ్ పై కేవలం ఒక్క టిక్ మాత్రమే చూపిస్తూ ఉండి, ఎంత సేపటికి బ్లూ టిక్ కనిపించకుంటే దాదాపు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది. ఇంకో పద్ధతి వచ్చేసి.. వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మనం భావిస్తామో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి. అయితే సుదీర్ఘ కాలంపాటు పైవి కనిపిస్తుంటే మనల్ని వారు దాదాపు బ్లాక్ చేసినట్లు అనుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.