వాట్సాప్.. ప్రస్తుతం సోషల్ మెసేజింగ్ యాప్లలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా కొనసాగుతోంది. మెసేజింగ్, గ్రూప్ కాల్, వీడియో కాల్ ఇలా ప్రతి అవసరానికి ప్రజలు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఒక సాధారణ మెసేజింగ్ యాప్‌ల తన ప్రస్తానాన్ని ప్రారంభించిన వాట్సాప్ ఇప్పుడు టాప్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే ఈ పాపులర్ యాప్‌పై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. వాట్సాప్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం రిస్క్ లో పడుతుందంటూ చాలా మంది తమగళాన్ని వినిపించారు. కానీ, వాట్సాప్ మాత్రం తమ యాప్‌లో ఎలాంటి లోపం లేదని చెబుతూ వస్తోంది. అయితే ఈసారి వాట్సాప్‌పై చాలా పెద్ద నిందే పడింది. అది చేసింది సాధారణ వ్యక్తి కాదు. వాట్సాప్‌పై టెలిగ్రామ్ ఫౌండర్ డురోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అది ఒక నిఘా యాప్ తీవ్ర ఆరోపణలు చేశారు.
డురోవ్ వాట్సాప్ గురించి మాట్లాడుతూ.. టెలిగ్రామ్ మెసేజ్‌ల ద్వారా డురోవ్ వాట్సాప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “యూజర్ల డేటాపై వాట్సాప్ 13 ఏళ్లుగా నిఘా ఉంచుతోంది. వాట్సాప్ ద్వారా యూజర్ల ఫోన్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వాట్సాప్‌లో వచ్చే సెక్యూరిటీ సమస్యలు అన్నీ కావాలనే లేవనెత్తేవి. కావాలనే అలాంటి సమస్యలను సృష్టిస్తున్నారు. ప్రతి ఏడాది వాట్సాప్ లో కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అవి యూజర్లను రిస్క్ లో పడేస్తున్నాయి. మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా, అత్యంత ధనవుతుడు అయినా మీ ఫోన్లో వాట్సాప్ ఉంటే.. మీ ఫోన్లో ఉన్న ప్రతి యాప్‌కు సంబంధించిన డేటాకు యాక్సెస్ ఉంటుంది. నేను టెలిగ్రామ్‌కి మారాని కోరడం లేదు. కానీ, వాట్సాప్‌కు దూరంగా ఉండండి” అంటూ డురోవ్ చెప్పుకొచ్చాడు.
Telegram founder(Pavel Durov) says “WhatsApp is a surveillance tool and users should stop using it” pic.twitter.com/1PFG3vyM1J
— Aakash Jadhav (@imakash_5) October 7, 2022
గతంలో వాట్సాప్ సెక్యూరిటీ విషయానికి సంబంధించి పలు సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా బగ్స్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ ఒక అప్‌డేట్‌ని విడుదల చేస్తూ వస్తోంది. రక్షణ విషయం వచ్చినప్పుడు వారి మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటాయంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇంక టెలిగ్రామ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యాప్ కూడా ప్రజల్లో బాగా పాపులర్ అయ్యింది. అయితే దీనిని ముఖ్యంగా మెసేజింగ్ యాప్ కంటే.. సినిమాలు డౌన్లోడ్ చేసుకునే యాప్‌గా చూస్తుంటారు. ఈ టెలిగ్రామ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు కూడా ఉన్నారు. ఒకరకంగా వాట్సాప్‌కు టెలిగ్రామ్ గట్టిపోటీ ఇస్తోందనే చెప్పాలి. డురోవ్ కూడా తమ టెలిగ్రామ్ యాప్‌కి ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నాడు.
“Hackers could have full access to everything on the phones of #WhatsApp users.”
Telegram founder Pavel Durov said that hackers merely need to transmit a malicious video to a WhatsApp user or start a video call via the app to seize control of a smartphone. pic.twitter.com/d2iqvDz0eJ— Al Mayadeen English (@MayadeenEnglish) October 7, 2022