మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. వాట్సప్ లో అడ్మిన్ల కోసమే ఓ ప్రత్యేకమైన ఫీచర్ వచ్చేసింది. కొందరు తమ అభిప్రాయలను, అభిరుచులను పంచుకోవడం కోసం వాట్సప్ లో ఓ గ్రూప్ ను ఏర్పాటు చేస్తుంటారు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఎవరైనా అందులో మెసేజెస్ చేయొచ్చు. అయితే ఒక్కోసారి కొందరు చేసే కొన్ని అభ్యతరకరమైన మెసేజ్ లు సభ్యులకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఆ మెసేజ్ పంపినవారు తప్ప ఇతరులు ఎవరూ వాటిని డిలిట్ చేయలేరు. ఆ మెసేజ్ డిలీట్ చేయాలంటూ మెసేజ్ పంపినవారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి సమస్యకి పరిష్కారం వచ్చింది.
వాట్సప్ లో గ్రూప్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ రాబోతున్నట్లు Wabetainfo తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను Wabetainfo షేర్ చేసింది. వాట్సప్ అప్ డేట్ లో ఈ ఫీచర్ ఉంది. వాట్సప్ అడ్మిన్ తమ గ్రూప్ లో మెసేజ్ డిలిట్ చేయొచ్చు. అడ్మిన్ అలా చేసిన మోసేజ్.. “this was removed by an admin” అని కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. బీటా టెస్టర్లు సక్సెస్ ఫుల్ గా ఈ ఫీచర్ ను పరీక్షించిన తర్వాత ఇతర యూజర్లందరికీ ఈ ఫీచర్ రిలీజ్ అవుతుంది.
వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ తో అడ్మిన్స్ కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. గ్రూప్స్ లో నకిలీ, హానికరమైన కంటెంట్ లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్స్ కు ఈ ఫీచర్ ఉపయోపడుతుంది. గతంలో వాట్సాప్ గ్రూప్స్ లో సదరు యూజర్లు పెట్టే మెసేజ్ లకు పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మిన్స్ దేనని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి సమయంలో ఈ ఫీచర్ వాట్సప్ అడ్మిన్స్ కి గ్రూప్ పై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇది నిజంగా వాట్సప్ అడ్మిన్స్ కి గుడ్ న్యూసే. మరి.. రానున్న ఈ కొత్త వాట్సప్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.