గూగుల్ రూపొందించిన జీ మెయిల్ సర్వీస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ చేసుకున్న నాల్గో యాప్ గా జీ మెయిల్ నిలిచింది. జీ మెయిల్ సాధించిన సరికొత్త రికార్డు ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో 10 బిలియన్ అంటే 1000 కోట్ల ఇన్ స్టాల్స్ మైలురాయిని జీమెయిల్ యాప్ అందుకుంది. గూగుల్ కు చెందిన మరో మూడు యాప్స్ ఇప్పిటికే ఈ ఘనత సాధించాయి. వాటిల్లో గూగుల్ ప్లే సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్. అసలు విశేషం ఏమిటంటే ప్రపంచ జనాభా కంటే అధికంగా ఈ యాప్స్ డౌన్ లోడ్స్ జరిగాయి.
జీ-మెయిల్ పేరుతో ఎలక్ట్రానిక్ మెయిల్ సర్వీసెస్ ను గూగుల్ 2004 ఏప్రిల్ లో ప్రారంభించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ కు భారీ ఆదరణ లభించింది. కాలానుగుణంగా జీమెయిల్ అద్భుతమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్.. గూగుల్ మీట్స్ ను కూడా యాప్ కు జోడించింది. వీటితో పాటు వినియోగదారులకు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్ సృష్టించిన ఈ సరికొత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.