డిపార్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ టాకాఫ్ ది టౌన్ గా మారింది. మీ ఆధార్ పై ఎక్కువ సిమ్లు ఉంటే డిసెంబరు 20 తర్వాత పనిచేయవంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 20లోపు టెలికామ్ డిపార్మెంట్ సూచనల మేరకు రీ వెరిఫై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఆ ఆదేశాల ప్రకారం ఒక ఆధార్ పై గరిష్ఠంగా 9 సిమ్ లు మాత్రమే ఉండాలి. జమ్ముకశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 6 సిమ్లు మాత్రమే ఉండాలని ఆదేశించింది.
రీ వెరిఫై చేసుకోవడం వల్ల మీకు తెలియకుండా మీ ఆధార్ పై ఏవైనా సిమ్లు ఉంటే మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అవసరం లేని సిమ్ కనెక్షన్ ను తొలగించుకునే అవకాశం వస్తుంది. డిసెంబరు 20 లోపు అలా చేయకుంటే.. మొత్తం సిమ్లను రెడ్ ఫ్లాగ్ చేస్తారు. అంటే వాటిని తిరిగి మీరు రీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీ ఆధార్ పై ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే.. అందుకు ఒక వెబ్ సైట్ అడ్రస్ ను ఇచ్చారు. TAF COP ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ పోర్టల్ లో ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయ్యాక మీ ఆధార్ కార్డుపై మొత్తం సిమ్లు ఉన్నాయో మీకు కనిపిస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం సిమ్ కనెక్షన్స్ ఉంటే ఇబ్బంది లేదు. అంతకన్నా ఎక్కువ ఉంటే వాటిలో మీకు అవసరం లేని సిమ్ కనెక్షన్ లను ఎంచుకుని వాటిని డీ యాక్టివేట్ చేయాలని కోరాలి. మీకు తెలియకుండా కనెక్షన్స్ ఉంటే వాటిని టిక్ చేసి ఇది నా నంబర్ కాదని ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండా మీ ఆధార్ పై ఎలాంటి కనెక్షన్లు ఉన్నా కూడా అవి డీ యాక్టివేట్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల మన ప్రేమయం లేకుండా మన పేరు మీద జరిగే ఫ్రాడ్ లను అరికట్ట వచ్చు. ఒక వేళ ఏమైనా జరిగినా కూడా ఆ నంబరు మీది కాదని చెప్పుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 20 ఇంకా ఎక్కువ సమయం లేదు గనుక https://tafcop.dgtelecom.gov.in/ పోర్టల్ లో లాగిన్ అయ్యి.. మీ ఆధార్ పై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో చూసుకోండి. టెలికాం డిపార్టమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.