వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత కుర్రాళ్ల అదరగొట్టారు. టీమిండియాను ఏకంగా ఐదో సారి అండర్ 19 విశ్వవిజేతగా నిలిపారు. అయినా కూడా అందులో కొంతమంది ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు తొలుత 1214 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో అండర్ వరల్డ్ కప్ చాంపియన్స్‌కు చోటు దక్కలేదు. తెలుగు తేజం 17 ఏళ్ల షేక్ రషీద్‌తో పాటు 8 మంది ఈ జాబితా నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
ఐపీఎల్ లీగ్ నిబంధనల ప్రకారమే ఈ 8 మంది ఆటగాళ్లను మెగా వేలం షార్ట్ లిస్ట్ నుంచి తొలిగించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనే ఆటగాళ్లు 19 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. అండర్ 19 ఆటగాళ్లు అయితే ఆయా రాష్ట్రాల జట్ల తరఫున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ, లిస్ట్ ఏ గేమ్ కానీ ఆడి ఉండాలి. అయితే షేక్ రషీద్‌తో పాటు హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ బానా, అంగ్‌క్రిష్ రఘు వంశీ, మనవ్ పరాక్, నిషాంత్ సింధు, గ్రావ్ సంగ్వాన్, రవి కుమార్, సిద్ధార్థ్ యాదవ్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో పాటు లిస్ట్ ఏ గేమ్ ఆడలేదు. దాంతో వారు మెగా వేలం షార్ట్ లిస్ట్ కాలేదు.
ఇక కరోనా కారణంగా దేశవాళీ అండర్ 19 క్రికెట్ టోర్నీలతో పాటు సీనియర్ లెవల్ టోర్నీలు వాయిదా పడటంతో చాలా మంది యువ ఆటగాళ్లు లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ 8 ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని, నిబంధనలను మార్చి ఈ టాలెంటెడ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్‌నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.