ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. అన్ని జట్లకి ఏమో గానీ, చెన్నై, ముంబైకి మాత్రం ఈ సీజన్ పీడకలలాగే నడుస్తోంది. చెన్నై అయినా కనీసం ఒక విజయం నమోదు చేసింది. కానీ, ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అటు పంజాబ్ సమష్టి కృషితో విజయం సాధించింది. అయితే పంజాబ్ విజయంలో టీమ్ కృషి మాత్రమే కాదు.. మయాంక్ అగర్వాల్ ఆటగాళ్లలో నింపే ఆత్మవిశ్వాసం కూడా కారణం అంటున్నారు. ఆ మాట చెప్పింది ఎవరో కాదు.. పంజాబ్ స్టార్ ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్.
ఇదీ చదవండి: ముంబయి వరుస ఓటములపై రోహిత్ శర్మ ఆవేదన!
మయాంక్ అగర్వాల్ గురించి చెప్తూ ఓడియన్ స్మిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘మయాంక్ అగర్వాల్ నా దగ్గరకు వచ్చి.. నాకు నూటిని నూరు శాతం సపోర్ట్ గా ఉంటానని చెప్పాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే’ అంటూ ఓడియన్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ పోషిస్తున్న తీరు ఎలా ఉంది అనేది ఓడియన్ మాటలు చూస్తే అర్థమవుతుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓడియన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.