టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వన్డే కెప్టెన్సీకి కూడా రాజీనామా చేసేందుకు విరాట్ సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. త్వరలో సౌతాఫ్రికా టూర్ తర్వాత వన్డే కెప్టెన్‌గా తప్పుకుని టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. బీసీసీఐ కూడా వన్డే కెప్టెన్‌గా తనను తప్పించే యోచనలో ఉన్నట్లు.. అంతవరకు తెచ్చుకోకుండా తానే గౌరవప్రదంగా తప్పుకుంటున్నట్లు కోహ్లీ సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
గంగూలీ, ద్రావిడ్‌ది కూడా అదే మాట..
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వన్డే జట్టుకు రోహిత్ శర్మను నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి టీమిండయా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం రానున్న వన్డే వరల్డ్ కప్. 2023లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడం అసాధ్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు వన్డే జట్టు కెప్టెన్ బాధ్యతలను అప్పగిస్తే.. 2023 ప్రపంచ కప్ వరకు పూర్తి స్థాయిలో అన్ని విధాల జట్టును సిద్ధం చేసుకునేందుకు రోహిత్‌కు అవకాశం ఉంటుంది.
నిజానికి ఈ విషయంలో కోహ్లీకి కూడా క్లారిటీ ఉందని, తన వన్డే కెప్టెన్సీ కూడా ఎక్కువ కాలం సాగాదని.. నిర్ణయం తీసుకోవడమే మంచిదని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుని బ్యాటింగ్‌పై పూర్తి ఫోకస్ పెట్టి ప్రపంచకప్‌లో రాణించి.. ఇండియాకు కప్ అందించాలనే కసితో ఉన్నాడు కోహ్లీ. సౌత్ ఆఫ్రికా పర్యటనే వన్డే కెప్టెన్‌గా కోహ్లీకి చివరిదని, ఆ తరువాత పగ్గాలు రోహిత్ చేతికి రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి.. వన్డే కెప్టెన్‌గా తప్పుకోవాలన్న కోహ్లీ నిర్ణయంపై.. రోహిత్ శర్మ నియామకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.