ఐపీఎల్ 2021 సెకెండాఫ్‌లో మరోసారి కరోనా పంజా విసిరింది. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ పేసర్ టి.నటరాజన్‌కు కరోనా నిర్ధరణ జరిగింది. అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ సహా మరో ఆరుగురు సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. మొత్తం టీమ్, సిబ్బందికి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా మిగిలిన అందరికీ రిపోర్టు నెగెటివ్‌గా వచ్చింది.
‘నటరాజన్‌కు ఆర్టీపీసీఆర్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను స్వీయ నిర్బంధంలో టీమ్‌కు దూరంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు’ అని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మిగిలిన అందరికి నెగెటివ్ వచ్చిన దృష్ట్యా బుధవారం సాయంత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేశారు.
Sunrisers Hyderabad pacer T Natarajan tests positive for COVID-19 but team’s evening IPL match against Delhi Capitals to go ahead: BCCI
— Press Trust of India (@PTI_News) September 22, 2021