SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sanju Samson Fans Fire On Deepak Hooda For Run Out Against West Indies

Sanju Samson: మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్న సంజూను ముంచిన దీపక్‌ హుడా!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sanju Samson: మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్న సంజూను ముంచిన దీపక్‌ హుడా!

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మంగళవారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ధావన్‌ చేసిన గట్టి పట్టుదలతో ఉంది.

Advertisement

కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ టీమిండియా ముందు 312 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. విండీస్‌ ఓపెనర్‌ హోప్‌ (115) సెంచరీకి తోటు, కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌(74) హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్‌ భారీ స్కోర్‌ సాధించింది. తొలి మ్యాచ్‌లో లానే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ బౌలర్లు వెస్టిండీస్‌వి ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.

312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ధావన్‌(13), సూర్యకుమార్‌ యాదవ్‌(9) పరుగులకే అవుట్‌ అయ్యారు. శుభ్‌మన్‌ గిల్‌(43)లో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌(54) విండీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 101 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయం వైపు నడిపించారు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ 63 పరుగులు చేసి జోసెఫ్‌ బౌలింగ్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు.

Samson

ఆ తర్వాత మ్యాచ్‌ను గెలిపించే బాధ్యత సంజూ శాంసన్‌పై పడింది. అయ్యర్‌ అవుట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దీపక్‌ హుడాతో కలిసి సంజూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ.. షెఫర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌ నాలుగో బంతిని సంజూ షార్ట్‌ ఫైన్‌లెగ్‌ వైపు ఆడాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కైల్‌ మేయర్స్‌ చేతుల్లోకి బంతి వేగంగా వెళ్లింది. అయినా కూడా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న దీపక్‌ హుడా సింగిల్‌ కోసం కాల్‌ చేశాడు.

బంతిని అందుకున్న కైల్‌ వేగంగా బౌలర్‌ ఎండ్‌కు బంతిని విసిరాడు. దాన్ని అందుకోవండంలో షెఫర్డ్‌ విఫలం అయినా.. బంతి వెళ్లి వికెట్లకు తాకింది. అప్పటికీ సంజూ క్రీజ్‌కు చాలా దూరంలో ఉన్నాడు. దీంతో భారత్‌ ఎంతో కీలకమైన సంజూ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. అక్షర్‌ పటేల్‌ రాణించడంతో భారత్‌ మ్యాచ్‌ గెలిచింది. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేంది.

ఇక చాలా రోజుల తర్వాత మంచి టచ్‌లో కనిపించి.. హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న సంజూ శాంసన్‌ను రాంగ్‌కాల్‌తో రనౌట్‌ చేయించిన దీపక్‌ హుడాపై సంజూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న నీకు బాల్‌ ఫీల్డర్‌ చేతుల్లో ఉన్న విషయం అర్థం కాలేదా? అసలు నీకు కళ్లు కనిపించవా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. మ్యాచ్‌ మంచి దశలో ఉన్న టైమ్‌లో రాంగ్‌కాల్‌తో ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అవుట్‌ చేయడం ఎంతో పెద్ద తప్పో మ్యాచ్‌ ఓడిపోయి ఉంటే హుడాకు అర్థం అయి ఉండేదని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సంజూ కాబట్టి ఆ సమయంలో నిశ్శబ్దంగా వెళ్లిపోయాడని హార్థిక్‌ పాండ్యానో, జడేజానో ఉండి ఉంటే హుడా చేవులు మూసుకోవాల్సి వచ్చేదని సంజూ ఫ్యాన్స్‌ అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించడంతో దీపక్‌ హుడా చేసిన తప్పు పెద్దగా ఎలివేట్‌ కాలేదు. లేదంటే మ్యాచ్‌ ఓటమికి కారణం హుడానే అయ్యేవాడు. మరి సంజూ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Sanju Samson had lost his wicket in a run out. If you missed, do watch it here! #WIvIND #sanjusamson pic.twitter.com/H1WvMABQf3

— CBTF Speed News (@cbtfspeednews) July 24, 2022

Tags :

  • Deepak Hooda
  • Latest Cricket News
  • Sanju Samson
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

    సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam