టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత రవిశాస్త్రి తన వ్యాఖ్యలతో హీట్ పెంచుతున్నారు. తను కోచ్ ఉన్న సమయంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు, వివాదాలపై ఇప్పుడు స్పందిస్తున్నారు. ఇటివల అంబటి రాయుడు గురించి మాట్లాడిన రవిశాస్త్రి.. ఇప్పుడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి స్పందించారు. తన వ్యాఖ్యల వల్లే కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టిన అశ్విన్.. మళ్లీ జట్టులోకి రాగలిగాడని అన్నాడు.
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2-1 తేడాతో తొలిసారి ఆ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో కుల్‌దీప్ యాదవ్ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ప్రదర్శనను కొనియాడిన రవిశాస్త్రి .. ఇక నుంచి విదేశాల్లో తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్ కుల్దీపేనని ప్రకటించాడు. ఆ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన అశ్విన్ ఈ వ్యాఖ్యలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. రవి శాస్త్రి మాటలు తన కలచివేశాయని, తనని బస్‌కింద తోసేసినట్లు అనిపించిందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: రాయుడి విషయంలో తప్పు జరిగింది! సంచలన నిజాలు బయటపెట్టిన రవిశాస్త్రి!
అశ్విన్ కామెంట్స్‌పై స్పందించిన రవిశాస్త్రి ‘ఆ మ్యాచ్‌లో అశ్విన్ ఆడలేదు. కానీ, కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాబట్టి నేను అతన్ని ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. నేను అలా చేయడం వల్లే అశ్విన్ మళ్లీ తన ఆటపై దృష్టిసారించి.. కొత్తగా ప్రయత్నించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎలాంటి భేషజాలు లేకుండా నిజాలు చెప్పడమే నా పని. అంతేకాని, ప్రతి ఒక్కరికీ వెన్న పూయడం కాదు. ఒక కోచ్ మిమల్ని పరీక్షిస్తే ఏం చేస్తారు? ఇంటికెళ్లి ఏడ్చుకుంటూ కూర్చొని నేను మళ్లీ ఆడను అంటారా? ఒక ఆటగాడిగా నేనైతే సవాళ్లను స్వీకరించి మెరుగవుతా. అలా నా కోచ్ చెప్పిన మాటలు తప్పని నిరూపించుకుంటా.కుల్‌దీప్ పట్ల నేను చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ బాధపడి ఉంటే.. అందుకు నేను సంతోషిస్తున్నా. అందువల్లే అతను సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో ఆటగాళ్లు, కోచ్ మధ్య అప్పట్లో విభేదాలు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అశ్విన్‌కు జట్టులో చోటు దక్కకపోవడానికి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కూడా కారణమనే వార్తలు వినిపించాయి. మరి రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రవిశాస్త్రితో ఉన్న చేదు అనుభవాన్ని పంచుకున్న స్టార్ స్పిన్నర్ అశ్విన్