ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఇక ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుత్‌రాజ్ గైక్వాడ్ బౌల్డ్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 ఓవర్లు ముగుసరికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఇక.. 6 ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న నటరాజన్ తొలి బంతికే అద్భుతమైన ఇన్స్వింగర్‌తో రుత్‌రాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నటరాజన్ వేసిన బంతిని గైక్వాడ్ అంచనా వేసే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై తెలుగు అభిమానులు.. ‘చూశావ్ గా గైక్వాడ్ గట్లుంటది సన్‌రైజర్స్ తోటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
— Peep (@Peep00470121) April 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.