ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ తమ రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో కేకేఆర్.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. భారీ ఆత్మవిశ్వాసాన్ని ముటగట్టుకుంది. అలాగే ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించినా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. మ్యాచ్ ఓడినా జట్టులోని స్టార్ ప్లేయర్లు అందరూ మంచి టచ్‌లో ఉండడంతో ఆర్సీబీ కూడా ఒకింత హ్యాపీగానే ఉంది. మరి రెండో మ్యాచ్‌లో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌లో ఉండడం ఆర్సీబీ సానుకూల అంశం. అలాగే విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్ ప్లేయర్లు తొలి మ్యాచ్ రాణించారు. ఓపెనర్‌గా యువ క్రికెటర్ రావత్ మరోసారి ఫాఫ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. మ్యాక్స్‌వెల్, హెజల్‌వుడ్ ఇంకా అందుబాటులో లేకపోవడం ఆర్సీబీని చాలా వీక్ చేస్తుంది. ఇక బౌలింగ్‌లో హసరంగా స్థాయి తగ్గట్లు రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. సిరాజ్ వికెట్లు తీస్తున్నా ధారళంగా పరుగులు ఇవ్వడం జట్టుకు మైనస్‌గా మారింది. అలాగే హర్షల్ పటేల్ కూడా లయ అందుకుంటే కేకేఆర్‌కు కష్టాలు తప్పవు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్..
ఈ ఏడాది కేకేఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఈ విషయాన్ని నిరూపిస్తూ.. తొలి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మట్టికరిపించింది. ఆ జట్టుకు బలమైన ఓపెనింగ్ ఓడి ఉండడం ప్లస్ పాయింట్. సీనియర్ ప్లేయర్ రహానే తొలి మ్యాచ్‌లో అంచనాలకు భిన్నంగా సూపర్ షాట్లతో ఫామ్‌లోకి వచ్చాడు. వీరికి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, రస్సెల్, షెల్డన్ జాక్సన్ ఫామ్‌లో ఉండడంతో కేకేఆర్ ఈ మ్యాచ్‌ను కూడా ఖాతాలో వేసుకోవచ్చు. అలాగే బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. స్పిన్‌లో వరుణ్ చక్రవర్తి ఉండనే ఉన్నాడు. నరైన్ నాలుగు ఓవర్లను ప్రత్యర్థి బ్యాటర్లు మర్చిపోవాల్సిందే. వికెట్లు తీయకున్నా.. పరుగుల ఇవ్వడంలో మాత్రం నరైన్ చాలా పినాసి. శివమ్ మావీ తొలి మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ బ్యాటర్లు కూడా మావీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా స్టార్లు ప్యాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ ఇంకా జట్టులో చేరలేదు.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. బలమైన బ్యాటింగ్ లైనప్, భీకరమైన బౌలింగ్‌తో కేకేఆర్ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కేకేఆర్ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రు రస్సెల్‌లలో ఇద్దరు చెలరేగినా ఆ జట్లు భారీ స్కోర్ సాధించగలదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తుది జట్ల అంచనా..
కేకేఆర్… శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానె, నితిష్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రూ రస్సెల్, షెల్డన్ జాక్సన్, సునీల్ నరైన్, శివమ్ మావీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆర్సీబీ… ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, రూథర్‌ఫర్డ్, హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మాద్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ.. ఈ బ్రాండ్ నేమ్ విలువెంతో తెలుసా..?
As KKR look to sustain their winning momentum, here is what their Playing XI could look like against RCB. #RCB https://t.co/etuuEOQFxQ
— HT Sports (@HTSportsNews) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.