ఐపీఎల్ 2022లో ఒక కొత్త రికార్డు నమోదైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 35 పరుగులు బాది ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. 4 ఫోర్లు, 5 సిక్సులతో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో గతంలో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ రికార్డును కమిన్స్ సమం చేశాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేఎల్ రాహుల్ కూడా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా పాట్ కమిన్స్, కేఎల్ రాహుల్ నిలిచారు.
కాగా ఈ సీజన్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా కమిన్స్ రికార్డు సృష్టించాడు. కమిన్స్ వీర బాదుడుతో ఐపీఎల్ 2022లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఈ మ్యాచ్‌లోనే డేనియల్ సామ్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తంగా 35 పరుగులు వచ్చాయి. ఇక మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన జాబితాలో సామ్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అతనికంటే ముందు 2021లో చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హర్షల్ పటేల్ 37 రన్స్, 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ప్రశాంత్ పరమేశ్వరన్ 37 రన్స్ ఇచ్చారు. ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అన్ని బంతులను కమిన్స్ బౌండరీలు బాదేశాడు.
మొదటి బంతి సిక్సు, రెండో బంతి పోర్, మూడు, నాల్గో బంతులు సిక్సులు బాదాడు. ఐదో బంతికి బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టినప్పటికీ అది నో బాల్ కావడంతో ఫలితం లేకుండా పోయింది. తర్వాతి ఫ్రీహిట్ బంతిని కూడా కమిన్స్‌ఫోర్ బాదాడు, ఆరో బంతికి సిక్సు బాది కోల్‌కతాను గెలిపించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగుతుంది అనుకున్న సమయంలో ఇలా ఊహించని మలుపుతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కత్తా గెలిచింది. నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరి కమిన్స్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు ఘోర అవమానం! వేలంలో అమ్ముడుపోని స్టార్
The Man of The Moment 💥@patcummins30 #KKRHaiTaiyaar #KKRvMI #IPL2022 pic.twitter.com/SV03cwSoGi
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022
WHAT. A. KNOCK 🔥#KKRHaiTaiyaar #KKRvMI #IPL2022pic.twitter.com/RmLZjZdzl3
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.