ఐపీఎల్ 2022 సీజన్ 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లక్నో ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో 2 విజయాలతో మంచి జోష్‌లో ఉంది. అలాగే ఢిల్లీ తొలి మ్యాచ్‌లో గెలిచినా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
లక్నో సూపర్ జెయింట్స్..
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని ఈ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లోను సమతూకంగా ఉంది. రాహుల్, డికాక్ రూపంలో లక్నో సూపర్ ఓపెనింగ్ జోడి ఉంది. అలాగే ఎవిన్ లూయిస్‌తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. మిడిల్దార్‌లో దీపక్ హుడా, బదోని, జెసన్ హోల్డర్ ఉన్నారు. అలాగే కృనాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఇక బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టైతో పాటు హోల్డర్ పేస్ బౌలింగ్ బలపలుస్తున్నారు. స్పిన్‌లో రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా ఉండనే ఉన్నారు. ఇలా జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఈ జట్టులో కెప్టెన్ రిషభ్ పంత్ ఒక్కడే రాణిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ విఫలం అయ్యాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు ఎంతో అవసరం. ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను ఆడితే ఓపెనింగ్ జోడి బలపడుతుంది. అలాగే నార్జియా కూడా ఆడే అవకాశం ఉంది. ఢిల్లో యువ ఆటగాడు లలిత్ యాదవ్ కూడా బాగానే రాణిస్తున్నాడు. ఇక ఢిల్లీ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్నారు. అలాగే పేస్‌లో ముస్తఫీజుర్ రహెమాన్, ఖలీల్ అహ్మాద్, శార్థుల్ ఠాకుర్ ఉన్నారు.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్‌చేసే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించే అవకాశం ఉంది. లక్నో ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గలు రాణిస్తే.. విజయం ఖాయం.
తుదిజట్ల అంచనా..
లక్నో.. కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, జెసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్.
ఢిల్లీ.. రిషభ్ పంత్(కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, లలిత్ యాదవ్, పావెల్, శార్థుల్ ఠాకుర్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జియా, కుల్దీప్ యాదవ్, ముస్తఫీజుర్ రహెమాన్.
ఇదీ చదవండి: ఇప్పటికీ, ఎప్పటికీ అతనే నా హీరో: రోహిత్ శర్మ
LSG vs DC: Future captains Rahul and Rishabh engage in battle of wits as Stoinis, Warner set to join forceshttps://t.co/EQcUzdfNHe #IPL2021 #LSGvsDC pic.twitter.com/7Lxs8uGY4a
— Sports Tak (@sports_tak) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.