ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీ గెలుపొంది.. ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ.. చరిత్రలో తొలి సారి CSK మొదటి మూడు మ్యాచ్‌లను ఓడింది. ఇక తొలి గెలుపు కోసం శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. అలాగే ఈ సీజన్‌లో SRH పరిస్థితి కూడా దారుణంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు పాయింట్ల పట్టకలో అట్టడుగుస్థానంలో ఉంది. మరి ఇప్పటి వరకు గెలుపు మొహం చూడని ఈ రెండు జట్లలో తొలి విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలును పరిశీలిద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తున్న ఈ టీమ్.. గ్రౌండ్‌లో మాత్రం అదే స్థాయిలో రాణించలేకపోతుంది. మూడు వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉంది. కెప్టెన్నీ మార్పుతో వచ్చిన కష్టంగా CSK ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. మిడిల్డార్‌లో రాయుడు, శివమ్ దూబే, ధోని ఉన్నారు. చివర్‌లో మొయిన్ అలీ, జడేజా, బ్రావోతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విషయంలో మాత్రం చెన్నై చాలా వీక్‌గా ఉంది. మొయిన్ అలీ, జడేజా, బ్రావోతో పాటు జోర్దాన్ బౌలింగ్‌లో రాణిస్తేనే చెన్నైకు విజయావకాశాలు ఉంటాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత బలహీనంగా ఉన్న జట్టు ఏదైన ఉందంటే అది SRH అనే చెప్పాలి. కెప్టెన్ విలియమ్సన్‌కు తోడు సరైన ఓపెనర్ పార్టనర్ లేడు. మిడిల్డార్ రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, పూరన్ ఉన్నా.. నిలకడలేమి ఇబ్బంది పెట్టే విషయం. పూరన్ అయితే ఫామ్‌లోనే లేడు. చివరి ఓవర్లలో హిట్టర్లు లేరు. కొద్దో గొప్పో పర్వాలేదు అనిపించేలా ఉన్న బౌలింగ్ విభాగం. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిస్తే.. అది కేవలం బౌలర్లు రాణిస్తే తప్ప.. వాళ్లు విఫలం అయ్యి.. బ్యాటర్లు మ్యాచ్ గెలిపించే అవకాశం లేదు.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్..
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు జరిగితే.. 12 చెన్నై, 4 సన్‌రైజర్స్ గెలుపొందాయి. దీంతో సన్‌రైజర్స్‌పై చెన్నైదే పూర్తి ఆధిపత్యంగా కనిపిస్తుంది.
ప్రిడిక్షన్..
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌తో పోల్చుకుంటే.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై.. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై వారి స్థాయికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం.
తుది జట్ల అంచనా..
CSK.. రవీంద్ర జడేజా(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, బ్రావో, శివమ్ దూబే, ప్రిటోరియస్, క్రిస్ జోర్దాన్, తుషార్ దేశ్‌పాండే.
SRH.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ప్రియమ్ గార్గ్, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
ఇదీ చదవండి: చాహల్.. నిన్ను చంపబోయింది ఎవరు?: వీరేంద్ర సెహ్వాగ్
All set to take on the Super Kings tomorrow 🙌#CSKvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/znsKVGJP4s
— SunRisers Hyderabad (@SunRisers) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.