ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్(56 బంతుల్లో 80) రాణించడంతో విజయం సులువైంది. కాగా మ్యాచ్ చివర్లో యువ సంచలనం ఆయుష్ బదోని సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు. ఇప్పటికే చూడచక్కటి షాట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బదోని.. బేబీ ఏబీడీగా పేరు తెచ్చుకున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టి.. అచ్చం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టైల్లో విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
గతంలో కోహ్లీ ఒక మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ తర్వాత.. చాలా అగ్రెసివ్‌గా తన జెర్సీ నంబర్ చూపిస్తాడు. కోహ్లీ చేసుకున్న సెలబ్రేషన్ ఫ్యాన్స్ మదిలో అలానే నిలిచిపోయింది. ఇప్పుడు బదోని కూడా అచ్చం అలానే చేయడంతో.. సోషల్ మీడియాలో ఇద్దరి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సిక్స్‌తో మ్యాచ్ ముగించి ధోని లాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చి.. కోహ్లీ లాంటి సెలబ్రేషన్‌తో బదోని అదరగొట్టాడంటూ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి బదోని సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ!
VIRAT KOHLI INFLUENCE ON YOUNGER GENERATION. #AyushBadoni #IPL2022 #ViratKohli𓃵 pic.twitter.com/GdadsAFIXV
— Hemant Singh (@hemant18326) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.