దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ గా ఎదిగిన ఏబీ డివిలియర్స్ ఎన్నట్టుండి అన్ని ఫార్మట్ల నుంచి గుడ్ బై చెబుతూ అందిరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏబీ తీసుకున్న ఈ సంచనల నిర్ణయానికి క్రికెట్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఇదే కాకుండా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఏబీడీ కీలక ఆటగాడిగా కొనసాగి అనేక సార్లు జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇలాంటి సమయంలో ఏబీడి రిటైర్ మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీ మంచి ఆటగాడిని కోల్పోయిందని అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కట్ చేస్తే.. తాజాగా ఏబీడీ మళ్లీ ఆర్సీబీ టీమ్ లోకి వస్తున్నాడన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
అవును మీరు విన్నది నిజమే. విషయం ఏంటంటే..? ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ గా ఉన్న సంజయ్ బంగర్ తాజాగా ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. తాజాగా సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలతో ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యహరిస్తున్న కోహ్లీకి, ఏబీడీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే హెబ్ కోచ్ ఏబీడీ వస్తే గనుక వీరిద్దరి కలయికలో టీమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే నిజంగానే డివిలియర్స్ బ్యాంటింగ్ హెడ్ కోచ్ గా వస్తున్నట్లు మాత్రం కొంతమేరకు తెలుస్తోంది. ఈ విషయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిర్వాహకులు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగానే ఏబీడీ ఆర్సీబీకి బ్యాటింగ్ హెడ్ కోచ్ గా నియమిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆర్సీబీ హెబ్ కోచ్ గా ఏబీ డివిలియర్స్ ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.