టీ20 వరల్డ్ కప్లో భాగంగా రెండో మ్యాచ్ కు భారత ఆటగాళ్లు సిద్దమవుతున్నారు. అయితే మొదట పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి భారత ఆటగాళ్లంత వారు ప్రాక్టిస్ చేస్తున్న ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు. నెట్స్ లో ప్రాక్టిస్ చేస్తున్న ఆటగాళ్ల ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఈ సారైన గెలవాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జడేజా వంటి కీలక ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. కనీసం ఈ మ్యాచ్ లోనైన ఓపెనర్లు బాగా ఆడి టీమిండియా గెలుపుకు సహరించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం గ్రూప్-2లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలో ఉంది. దీంతో పాటు న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉండగా భారత్ ఐదో స్థానానికి పరిమితమవటం విశేషం.
View this post on Instagram
