సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు డిసెంబర్ 31ని బాగా సెలబ్రెట్ చేసుకున్నారు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలిమ్యాచ్ అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా న్యూ ఇయర్ పార్టీలో ఆ గెలుపును ఎంజాయ్ చేసినట్లు కనిపించారు. ఈ పార్టీలో టీమిండియా ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కుర్రాళ్లతో కలిసి ఎంజాయ్ చేయడం హైలెట్‌గా నిలిచింది. మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా పార్టీ మూడ్‌లో కనిపించారు.
భారీ కేక్‌ను కట్ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయంతో 1-0 ఆధిక్యంలో ఉంది. మరింత ఉత్సాహంతో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. మరి టీమిండియా ఆటగాళ్ల సెలబ్రెషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
May the New Year bring you more happiness, success, love and blessings! Happy new year 2022 ❤️❤️ #mshami11 pic.twitter.com/9xGqR3YZeP
— Mohammad Shami (@MdShami11) December 31, 2021