‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో భాగంగా కాన్పూర్ వేదికగా మొదటి టెస్టు నడుస్తోంది. మొదటి టెస్టు మూడోరోజు టీమిండియా యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతమైన ఘనతను సాధించాడు. కేవలం నాలుగు టెస్టుల్లోనే ఐదుసార్లు ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. అత్యంత వేగంగా ఐదుసార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అక్షర్ పటేల్ రికార్డుల కెక్కాడు.
Stupendous bowling performance from @akshar2026 today 👏👏#INDvNZ @Paytm pic.twitter.com/8tbMK6fitk
— BCCI (@BCCI) November 27, 2021
న్యూజిలాండ్ రెండోరోజు ఆట చూస్తే వాళ్లు 500లు కూడా అలవోకగా కొట్టేసేలా కనిపించారు. అలాంటి ఓపెనర్స్ పార్టనర్షిప్ ని అశ్విన్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత బాధ్యతను అక్షర్ తీసుకున్నాడు. క్రీజులోకి వచ్చేవారిని వరుసగా పెవిలియన్ చేర్చడమే లక్ష్యంగా బౌలింగ్ చేశాడు. 296లో ఓపెనర్లు కొట్టిన స్కోర్ 184 తీసేస్తే.. తర్వాతి బ్యాట్స్ మన్లు అంతా కలిపి చేసిన 112 పరుగులు మాత్రమే. అంతలా కట్టడి చేయడంలో అక్షర్ కృషి ఎంతో ఉంది.
FIFTH 5⃣-wicket haul in Test cricket for @akshar2026 👏 👏
What a fantastic bowling display this is! 👌 👌
Live – https://t.co/9kh8Df6cv9 #INDvNZ @Paytm pic.twitter.com/U7ulyEzQDK
— BCCI (@BCCI) November 27, 2021
ఇంగ్లాండ్ టూర్ తో టెస్టు కెరీర్ ప్రారంభించిన అక్షర్ మొదటి నుంచి ప్రతిభ చాటుతూనే ఉన్నాడు. కేవలం 7 ఇన్నింగ్సులకే ఈ ఘనత సాధించాడు. 7 ఇన్నింగ్స్ లలో ఐదుసార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన మొదటి టీమిండియా ప్లేయర్ గా అక్షర్ నిలిచాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ ‘రోడ్నీ హాగ్’ 6 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించి మొదటి బౌలర్ గా ఉన్నాడు. ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తే భారత్ కు మరో అద్భుత స్పిన్నర్ దొరికినట్లే. ఇంకా ఎన్నో సంవత్సరాలు టీమిండియాకి అతను సేవలందించగలడు. అక్షర్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Innings Break!
Ashwin picks up the final wicket as New Zealand are all out for 296. #TeamIndia lead by 49 runs.
Scorecard – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/GDBqhNP0u1
— BCCI (@BCCI) November 27, 2021