ఐపీఎల్ అనగానే ఆటగాళ్ల షాట్స్, వాళ్ల సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. తమ అభిమాన ఆటగాళ్లు, జట్టులకు అభిమానులు అందించే సపోర్ట్ కూడా ముఖ్యం. అందులో మరీ ముఖ్యంగా లేడీ అభిమానుల కేరింతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే కెమెరామెన్ల ప్రతిభాపాఠవాల పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. 2019 ఐపీఎల్ సీజన్ లో రెడ్ డ్రస్‌లో ఆర్సీబీ జెండా ఊపుతూ కనిపించిన దీపికా ఘోష్ నుంచి, దీపక్ చాహర్ సోదరి మల్తీ చాహర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ వరకు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు.
ఇదీ చదవండి: అశ్విన్ రిటైర్డ్ అవుట్.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి
ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో పేరు చేరింది.. ఆవిడే ఆర్తీ బేడి. ఆదివారం ఢిల్లీ- కోల్‌కతా మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కు సపోర్ట్ చేస్తూ ఆర్తీ బేడీ కనిపించింది. ఆమెపై కెమెరామెన్ ఫోకస్ పెట్టడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆర్తీ బేడి ముక్కు మొఖం తెలియని వ్యక్తేం కాదు యాక్టర్. ఇప్పటికే కొన్ని కమర్షియల్స్ లో నటించింది కూడా. ఆమెకు విదేశీ ప్రయాణాలు అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికే సెలబ్రిటీ అయినా కూడా ఆమెకు ఆ గుర్తింపు రాలేదు. కానీ, ఒక్క మ్యాచ్ తో ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 30 వేలను 55 వేలకు చేరిపోయింది. ఒక్క రాత్రిలో 25 వేల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆర్తీ బేడీ ఓవర్ నైట్ స్టార్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Before match 🔛 After Match#IPL2022 #KKRvDC #RRvLSG #AartiBedi pic.twitter.com/Sw2hKg4l4S
— Abhishek 💙 (@imAb_45) April 10, 2022