భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ కు ముందు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఫ్యాన్స్ తోపులాటలు, ఫైట్స్ మధ్య మైదానం రణరంగంగా మారింది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఫైట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇండియాలో సినిమాలకు, క్రికెట్ కు ఉన్న ఆదరణ ఇతర రంగాలకు లేదంటే అతిశయోక్తికాదు. మరీ ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్ ను ఓ మతంలా చూస్తారు. అదీకాక భారతీయులకు క్రికెట్ ఆటకాదు.. ఓ ఎమోషన్. అందుకే టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగినా కానీ ప్రేక్షకులు వేల సంఖ్యలో పోటెత్తుతుంటారు. అలాంటి క్రమంలో కొన్ని కొన్ని ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. తాజాగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఫ్యాన్స్ తోపులాటలు, ఫైట్స్ మధ్య మైదానం రణరంగంగా మారింది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఫైట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్ లో క్రికెట్ కు అభిమానులు కాదు.. భక్తులు ఉన్నారు అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. ఇక వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్ లకు ఆఫీసులకు సెలవులు పెట్టిమరీ గ్రౌండ్స్ కు, టీవీలకు అతుక్కుపోతుంటారు క్రికెట్ లవర్స్. ఇక దగ్గర్లోని గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలా ఎలాగైనా టికెట్స్ సంపాదించి మ్యాచ్ చూడాలనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే టికెట్లు కొనే క్రమంలో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఇండియా-ఆసీస్ మ్యాచ్ లో కూడా ఇదే విధంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబైలోని ఆజాద్ మైదాన్ చిన్నపాటి రణరంగాన్నే తలపించింది.
ఈ క్రమంలోనే తొలి వన్డే మ్యాచ్ కు సంధించిన టికెట్లను ఆజాద్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఇక అభిమానులు టికెట్లను కొనడానికి పోటేత్తారు.. టికెట్ల కోసం క్యూలో నిలబడ్డారు. కానీ వరుసలో నిలబడ్డ రెండు గంటల వరకు కూడా టికెట్ కౌంటర్ తెరవలేదు. దాంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక టికెట్ కౌంటర్ కు ఉండే కిటికీ గ్రిల్ ను ఊడగొట్టి అక్కడ రణరంగాన్ని సృష్టించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిని ఒకరు నెట్టకుంటూ.. కొద్దిసేపు ముష్టి యుద్దాన్ని చేశారు. ఈ ఘటన గురించి సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితులను అదుపుచేశారు. ఫ్యాన్స్ ను నిలువరించే క్రమంలో వారిపై లాఠీ ఛార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిర్వాహకులు ఒకటే టికెట్ కౌంటర్ ను ఏర్పాటు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఫ్యాన్స్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Scenes at the Azaad Maidan in Mumbai. Online tickets are supposed to be collected from here. Number of counters should be increased if they know that a large no. of people are expected. Horrible management 👎
Won’t suggest to anyone.@MumbaiCricAssoc @NorthStandGang @BCCI pic.twitter.com/rP51wcFDJj— Ojas Naidu (@Cricky_Nerd) March 17, 2023
