పసికూన ఐర్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ దీపక్ హుడా సెంచరీలో చెలరేగగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ కలిసి టీమిండియా తరపున టీ20ల్లో రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 176 పార్ట్‌నర్ షిప్‌తో చరిత్ర సృష్టించారు. భారత్‌కు టీ20ల్లో ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.
చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే అప్పటి వరకు ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే.. ఈ రన్స్ పెద్ద కష్టంగా అనిపించలేదు. దానికి తోడు ఉమ్రాన్ మాలిక్ రెండో బంతి నోబాల్‌గా వేయడంతో ఎక్స్‌ట్రా డెలివరీతో పాటు ఫ్రీహిట్ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఐరీష్ బ్యాటర్లు వరుసగా రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేసేలా కనిపించారు.
కానీ తర్వాతి మూడు బంతులను ఉమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలు బాదకుండా కచ్చితమైన యార్కర్లు సంధించాడు. దాంతో చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరి ఈ మ్యాచ్‌తో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసిన దీపక్ హుడా-సంజూ శాంసన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝗪. 𝗜. 𝗡. 𝗡. 𝗘. 𝗥. 𝗦 🏆
That’s a wrap from Ireland! 👍#TeamIndia win the two-match #IREvIND T20I series 2️⃣-0️⃣. 👏 👏 pic.twitter.com/7kdjMHkrFR
— BCCI (@BCCI) June 28, 2022
Deepak Hooda and Sanju Samson claim the #1 spot 👏#IREvIND pic.twitter.com/l3nF8lsWQE
— ICC (@ICC) June 29, 2022