ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చాలా కాలంగా ఉన్నాడు. 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు అన్ని జట్లు మెగా వేలానికి వెళ్లనున్నాయి. వేలానికి ముందు అన్ని జట్లు కొందరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. కానీ సన్‌రైజర్స్ మాత్రం తమకు ట్రోఫీ అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. అంతకు ముందే.. వార్నర్‌ను జట్టు కెప్టెన్‌గా తొలగించి, అతనిస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించి విషయం తెలిసిందే.
అ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా వార్నర్‌ను తప్పించింది SRH మేనేజ్మెంట్.. ఈ నిర్ణయంపై SRH ఫ్యాన్స్ కూడా అసంతృత్తి చెందారు. ఇక అక్కడి నుంచి వార్నర్‌కు, SRH మేనేజ్మెంట్కు గ్యాప్ పెరుగుతూ వచ్చింది. SRH వార్నర్‌ను అవమానించిందంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్‌కు మద్దతు తెలుపుతూ.. SRHను తిట్టిపోశారు. 2021 ఐపీఎల్ సీజన్లో SRH ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో నిలబడింది.
ఇక 2022 సీజన్ కోసం జరిగే మెగా వేలంలో వార్నర్ ఆర్సీబీకి ఆడనున్నట్లు ప్రచారం మొదలైంది. వీటన్నింటి నేపథ్యం వార్నర్ మొదటి సారి SRHలో తనకు జరిగిన అవమానంపై స్పందించాడు. తనను కెప్టెన్‌గా తొలగించారు సరే.. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తప్పించడం తనను చాలా బాధకు గురిచేసిందని వార్నర్ వాపోయాడు. అలా చేయడం జట్టులోని జూనియర్లకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే అనే ఒక నెగిటివ్ మెసేజ్ వారికి పోదా? అని ప్రశ్నించాడు.
SRH ఫ్యాన్స్ తనపై ఎంతో అభిమానం చూపిస్తారని.. వారి అభిమానం తనకు ఎప్పుడూ ఉంటుందని వార్నర్ అన్నాడు. అభిమానులతో ఎలా కనెక్ట్ అవ్వాలో తనకు తెలుసని వార్నర్ చెప్పుకోచ్చాడు. అలాగే ప్రతి జట్టులో ఒక ఐకాన్ ప్లేయర్ ఉంటాడని.. అది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని వార్నర్ అన్నాడు. వాస్తవానికి SRHకు వార్నర్ ఐకాన్ ప్లేయర్‌గానే ఉన్నాడు. SRH ఫ్యాన్స్ వార్నర్‌ను ఇప్పటికీ చాలా అభిమానిస్తారు. మరి ఈ వ్యాఖ్యలతో వార్నర్ SRHలో 2022 సీజన్లో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టమైంది. మరి వార్నర్ వ్యాఖ్యలపై SRH మేనేజ్ మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ట్విట్టర్లో వార్నర్.. SRH ట్వీట్స్‌పై సెటైర్లు వేస్తునే ఉన్నాడు. మరి వార్నర్ విషయంలో SRH మేనేజ్మెంట్ వ్యవహారించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Part 1 of #BackstageWithBoria @davidwarner31 Comeback man of 2021. Opens up on @IPL, mental health, bubble life, family, urge to win, winning the world cup and more. @AgeasFederal @officialfanatic @Just_My_Roots full show https://t.co/CK9jHa2Zqg pic.twitter.com/spjW1RVifS
— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022
Part 2 of #BackstageWithBoria @davidwarner31 on what happened in the @IPL and why he felt what he felt and what the fans mean to him. Full show YT https://t.co/CK9jH9LoyI pic.twitter.com/WN073LRgNh
— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022
Part 3 #BackstageWithBoria @davidwarner31 @AgeasFederal @officialfanatic @Just_My_Roots full show https://t.co/CK9jHa2Zqg this is as candid as one can get. pic.twitter.com/VjEb4ZLFmM
— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022