2021 లో చివరిసారి జాతీయ జట్టుకి ఆడిన రస్సెల్ ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. ప్రస్తుతం జాతీయ జట్టును మీద ఆసక్తి చూపిస్తూ వరల్డ్ కప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్ధికంగా చాలా వెనకపడి ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రపంచానికి ఎంతో మంది గొప్ప ప్లేయర్లను పరిచయం చేసిన విండీస్ జట్టు ప్రస్తుతం చాలా అద్వానంగా తయారైంది. కనీసం వరల్డ్ కప్ కి కూడా అర్హత సాధించలేకపోవడంతో కరీబియన్ జట్టు మీద ఇప్పుడు అందరూ జాలి చూపిస్తున్నారు. దేశంలో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ అందరూ ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. విండీస్ బోర్డు ప్లేయర్లకు చాల తక్కువ ఫీజ్ చెల్లించడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఈ లిస్టులో స్టార్ ప్లేయర్ఆండ్రీ రస్సెల్ కూడా ఉన్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టు గురించి పట్టించుకోకుండా ఫ్రాంచైజీ క్రికెట్ కే ప్రాధాన్యమిచ్చిన ఈ స్టార్ ఆల్ రౌండర్ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లుగా తెలిపాడు.
ఏ క్రికెటర్ కైనా జాతీయ జట్టులో స్థానం సంపదుంచుకోవడం ఒక కళ. కానీ విండీస్ ప్లేయర్లు మాత్రం దానికి భిన్నం. జాతీయ జట్టులో ఆడదానికి అవకాశం ఉన్నా ప్రపంచ లీగ్ లు ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. దాదాపు డజన్ల మంది ప్లేయర్లు ఇలా జాతీయ జట్టు ఆసక్తి చూపించకుండా తమదారి తాము చూసుకున్నారు. అయితే రస్సెల్ మాత్రం దేశానికి తన అవసరం ఉందని గ్రహించాడు. అందుకే దేశం కోసం ఫ్రాంచైజీ క్రికెట్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రస్సెల్ అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ ఆడాలని ఉందని తన మనసులోని మాటను తేలియజేసాడు.
” ప్రస్తుతం నేను అందుబాటులో ఉన్నాను. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా. ఒకవేళ ఎంపికైతే ఎంతో సంతోషిస్తా. ఆలోపు రెండు మూడు సిరీస్‌లు ఆడాలని ఉంది. ప్రస్తుతం దేశం తరఫున వరల్డ్ కప్ ఆడడం తప్ప నా మనసులో వేరే ఏమీ లేదు. ఎప్పుడైనా జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా” అని రస్సెల్ చెప్పుకొచ్చాడు. చివరిసారిగా రస్సెల్ 2021 లో విండీస్ జెర్సీతో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌తో రస్సెల్ విండీస్ బోర్డుకు గుడ్ బై చెప్పాడు. 2012, 2016లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచిన విండీస్ జట్టులో ఈ ఆల్‌రౌండర్ సభ్యుడు. మరి రస్సెల్ ఆశించినట్లుగా సెలక్టర్లు ఈ స్టార్ ఆలిరౌండర్ ని కరుణిస్తారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.