కాంగ్రెస్ లోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో ఈ అంశం కోడై కూస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు ఓ ఆఫర్ కూడా ఇచ్చిందట. అయితే తాజాగా ప్రశాంత్ కిశోర్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ (ఈఏజీ)లో భాగంగా పార్టీలో చేరి, ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను నేను తిరస్కరించాను… నా వినయపూర్వక అభిప్రాయం ప్రకారం.. సంస్కరణల ద్వారా లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి నా కంటే పార్టీకి నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని ప్రశాంత్ కిశోర్ తాజాగా ట్విట్టర్ లో తెలిపారు.
ఇది కూడా చదవండి: మా అన్నతో నాకు గొడవల్లేవ్.. ఆయన వల్లే నేను ఇక్కడ పార్టీ పెట్టాను: షర్మిల
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పందిస్తూ.. ప్రశాంత్ కిశోర్ ప్రజంటేషన్, చర్చల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ను ఏర్పాటుచేశారని ఆయన తెలిపారు. ఈ గ్రూప్‌లో భాగంగా పార్టీలో చేరాలని ప్రశాంత్ కిశోర్‌ను ఆహ్వానించాము, కానీ ఆయన నిరాకరించారు. అయితే, ఆయన పార్టీకి ఇచ్చిన సూచనలు, చేసిన కృషిని అభినందిస్తున్నామని రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. ప్రశాంత్ కిశోర్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.