విజయవాడకు సమీపంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నెలకొల్పిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు విజయవాడలో ఆవిర్భావ వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించి జనసేన పార్టీ ఫ్లెక్సీలను విజయవాడలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
దీంట్లో భాగంగా విజయవాడ బ్యారేజీ వద్ద నెలకొల్పిన ఫ్లెక్సీలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి మంగళగిరి జనసేన కార్యాలయానికి వెళ్తున్న జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఫెక్ల్సీల తొలగింపు చూసి మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఉంచి జనసేన ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయమని అన్నారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. మూడు గంటల సినిమాకే కాదు జనసేన ఫ్లెక్సీలను చూసి కూడా అధికార పార్టీ భయపడుతుందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
విజయవాడ నుంచి గుంటూరు మీదగా వెళ్లే వారధి పై పెట్టిన జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీస్ శాఖ
పోలీసుల మీద ఫైర్ అయిన PAC చైర్మైన్ శ్రీ @mnadendla గారు. #JSPFormationDayMarch14Th#AndhraPradesh #Vijayawada pic.twitter.com/AcCV19mCCp
— JanaSwaram News (@JanaswaramNEWS) March 13, 2022