SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Chennai Metro Phase 2 Modi Vijay

చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 12 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా అత్యంత కీలకమైన పూనమల్లి నుంచి వడపళని వరకు ఉన్న 15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ప్రధాని మోదీ స్వయంగా మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో సాగిన ఈ కార్యక్రమం రాజకీయంగా, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా మెట్రో టికెట్ కొనుగోలు చేసి, కౌంటర్లో ఉన్న ఉద్యోగితో కాసేపు సరదాగా మాట్లాడారు

చెన్నై నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను విప్లవాత్మకంగా మార్చిన మెట్రో ప్రాజెక్ట్ ప్రయాణం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. చెన్నై మెట్రో ఫస్ట్ ఫేజ్ పనులు 2009లోనే మొదలుకాగా, 2015 నాటికి తొలి సర్వీసులు ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా విస్తరిస్తూ తొలి దశకు సంబంధించిన 54.1 కిలోమీటర్ల పూర్తి మార్గం 2019 ఫిబ్రవరి నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో రెండు ప్రధాన కారిడార్లు ఉండగా, నగర వాసులు వీటిని విపరీతంగా ఆదరించారు. దీంతో మరింత రద్దీని నియంత్రించేందుకు, నగర విస్తరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రెండో దశకు అంకురార్పణ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా 2020 నవంబర్ 21న చెన్నై మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

కారిడార్ 3 విషయానికొస్తే.. మాధవరం నుంచి సిప్‌కాట్ వరకు 45.8 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇక కారిడార్ 4 లైట్ హౌస్ నుంచి పూనమల్లి వరకు 26.1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారిడార్ 5 మాధవరం నుంచి షోల్లింగనూర్ వరకు 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రారంభించిన 15 కి.మీ. మార్గం రెండో దశలోని నాలుగో కారిడార్‌లో భాగమైన పూనమల్లి బైపాస్ – వడపళని ఎలివేటెడ్ కారిడార్‌ కావడం విశేషం. ఈ కొత్త రూట్‌లో మొత్తం 11 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి

సెకండ్ ఫేజ్‌లోని మూడు కారిడార్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే, 2028 నాటికి మొత్తం 118.9 కిలోమీటర్ల మేర ఈ మూడు కారిడార్లను పూర్తి చేయాలని చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి ఈ రెండో దశ పనులన్నీ పూర్తయితే, చెన్నై నగరంలో మొత్తం మెట్రో నెట్‌వర్క్ పొడవు ఏకంగా 173 కిలోమీటర్లకు చేరుకుంటుంది. దీనిద్వారా దేశంలో అత్యధిక పొడవైన మెట్రో మార్గం కలిగిన నగరాల జాబితాలో చెన్నై నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో తొలి స్థానంలో ఢిల్లీ, రెండో స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగళూరు నగరాలు కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రో విషయానికి వస్తే.. ప్రస్తుతం నగరంలో 67 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులో ఉంది. అయితే, మరో 162.5 కి.మీ. మేర రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, మెట్రో డీపీఆర్ కు కేంద్రం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ కింద పలు కారిడార్లు ప్రణాళికలో ఉన్నప్పటికీ, డీపీఆర్‌కు ఆమోదం లభించకపోవడంతో 2028 నాటికి హైదరాబాద్‌లో రెండో దశ పూర్తికావడం కష్టమని పలువురు అభిప్రాయడుతున్నారు. ఏదేమైనా చెన్నై మెట్రో రెండో దశ విస్తరణ దక్షిణ భారతదేశంలోనే రవాణా రంగానికి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

Tags :

  • Chennai Metro
  • Chennai Metro Phase 2
  • Hyderabad Metro
  • narendra modi
  • Tamil Nadu CM Vijay
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీఎం విజయ్‌ సంచలన ప్రకటన…పతకాలు సాధించిన వారికి రూ.30 లక్షలు

స్క్వాష్ స్టార్‌లకు సీఎం విజయ్ భారీ నజరానా.. తలా రూ.30 లక్షలు!

  • 40 ఏళ్ల రికార్డును తిరగరాసిన గుల్వీర్ సింగ్.. ప్రధాని మోదీ ప్రశంసలు

    40 ఏళ్ల రికార్డును తిరగరాసిన గుల్వీర్ సింగ్.. ప్రధాని మోదీ ప్రశంసలు

  • హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో

  • మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

    మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

  • మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. ఇక వారి కష్టాలు గట్టెక్కినట్లేనా..?

    మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. ఇక వారి కష్టాలు గట్టెక్కినట్లేనా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam