మరో వీకెండ్ వచ్చేసింది. ఏడాది చివరకు కూడా వచ్చేశాం. దీంతో చాలామంది ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. మిగతావి ఏంటనేది పక్కనబెడితే.. చాలామంది ప్రతి వీకెండ్ కచ్చితంగా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ వారం ఏమేం చిత్రాలు వచ్చాయా అని వెతుకుంటారు. మీరు అంత శ్రమ పడాల్సిన పనిలేకుండా ఆ లిస్టుతో మేం మీ ముందుకు వచ్చేశాం. ఇందులో తెలుగు కొత్త సినిమాలతో పాటు పలు డబ్బింగ్ ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి వారంలానే ఈవారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ఉంది. సోషల్ థ్రిల్లర్ లా దీన్ని తెరకెక్కించారు. దీనితో పాటే కారి అనే తమిళ డబ్బింగ్ మూవీ, జయ జయ జయ జయహే అనే మలయాళ డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఇవి రెండు ఆయా భాషల్లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. అలానే అమాలాపాల్ ప్రధాన పాత్రలో నటించిమ ‘ద టీచర్’ మూవీ కూడా రేపే రిలీజ్ కానుంది.