ఎప్పటిలానే ఓటీటీలో ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అందులో సుధీర్ 'గాలోడు' దగ్గర నుంచి రణ్ వీర్ 'సర్కస్' సినిమా వరకు చాలా ఉన్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా?
సినిమా థియేటర్ కి వెళ్లి చూడాలంటే కష్టం కానీ ఓటీటీలో మూవీస్ అంటే మాత్రం అందరూ రెడీ అయిపోతారు. వీకెండ్ కి ఏ మూవీ చూడాలి. రిలీజ్ అవుతున్న వాటిలో ఏది ఫస్ట్ చూడొచ్చు అని ముందు నుంచే ప్లాన్స్ రెడీ చేసి పెట్టుకుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం ఓటీటీలో పదుల సంఖ్యల చిత్రాలు, వెబ్ సిరీసులు విడుదలవుతుంటాయి. ఎప్పటిలానే ఈ వారం కూడా ఏకంగా 30 సినిమాలు/ వెబ్ సిరీసులు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ లిస్టులో ఏయే మూవీస్ ఉన్నాయి. వాటి సంగతి ఏంటనేది ఇప్పుడూ చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతి సినిమాల సందడి తగ్గిన తర్వాత ప్రతివారం మీడియం రేంజ్ హీరోల మూవీస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. గతవారం కూడా అలానే కొన్ని విడుదలైనప్పటికీ.. మిక్స్ డ్ టాక్ మాత్రమే తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఏకంగా 30 చిత్రాలు/వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు సిద్ధమైపోయాయి. వాటిలో సుధీర్ ‘గాలోడు’ అందరినీ ఆకర్షిస్తోంది. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. దీనితో పాటు ‘కళ్యాణం కమనీయం’, ‘లాస్ట్’, ‘సదా నన్ను నడిపే’, ‘సర్కస్’ సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి.