హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ సినిమాల దగ్గర నుంచి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ల వరకు అన్నీ ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ తర్వాత చాలామంది ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు మాత్రం అది కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. ఓటీటీలో ఏదైనా మంచి మూవీ వచ్చిందా అని చూస్తున్నారు. దాన్నిబట్టి వాటిని చూడాలా లేదా అని డిసైడ్ చేసుకుంటున్నారు. ఇక ప్రతివారం వచ్చే సినిమాల కంటే ఈసారి కాస్త ఎక్కువగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఎందుకంటే ఏకంగా 24 సినిమాలు ఆ లిస్టులో ఉన్నాయి. వాటిలో తెగింపు, కళ్యాణం కమనీయం, రాజయోగం, వేద అనే తెలుగు సినిమాలుండటం విశేషం. వీటితోపాటే అన్ని భాషల చిత్రాలు-వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి.