ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరి సినిమాలు మినిమమ్ అంచనాలు కూడా క్రియేట్ చేయలేకపోయాయి. ఇలాంటి తరుణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్ కి కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రిలీజ్ ముందు భారీగా ట్రోల్స్ ఫేస్ చేసిన బ్రహ్మాస్త్ర.. రిలీజ్ అయ్యాక ట్రోల్స్ పక్కనపెట్టేసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ఈ బ్రహ్మాస్త్ర చిత్రంలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించారు.
ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు సంయుక్తంగా నిర్మించిన బ్రహ్మాస్త్ర.. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ ఎంత రాబట్టింది అనే విషయాలను పక్కన పెడితే.. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1- శివ’గా అందరినీ ఆకట్టుకుంది. మంచి స్టోరీ లైన్.. స్టార్ కాస్ట్.. తో విజువల్ లవ్ డ్రామాగా బ్రహ్మాస్త్ర.. ‘పార్ట్ 2 దేవ్’పై ఆడియెన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది. ఇక బ్రహ్మాస్త్ర చిత్రం.. తెలుగులో బ్రహ్మాస్త్రంగా విడుదలై డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కావాల్సిందే కదా.. థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన బ్రహ్మాస్త్రను ఓటిటిలో చూసేందుకు టైమ్ వచ్చేసింది.
సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు బ్రహ్మాస్త్ర ఓటిటిలోకి వస్తుందా! అని ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. బ్రహ్మాస్త్ర డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుందని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ముందస్తు ఒప్పందం ప్రకారం.. చిత్రం విడుదలై యాభై రోజులు పూర్తయిన తర్వాత ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ఇక బ్రహ్మాస్త్ర మూవీ.. నవంబర్ 4 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల టాక్. ఈ లెక్కన బ్రహ్మాస్త్రం కోసం వెయిట్ చేస్తున్న ఓటిటి ఆడియెన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చూడాలి మరి బ్రహ్మాస్త్రం ఓటిటిలో ఎలాంటి రికార్డులు సృస్టించనుందో!
#Brahmastra pic.twitter.com/0AmNSb0ab8
— Aakashavaani (@TheAakashavaani) October 18, 2022