టీ20 వరల్డ్ కప్‌లో కొత్త జెర్సీతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీని ఇటివల బీసీసీఐ విడుదల చేసింది. ఈ జెర్సీ ప్రమోషన్ కోసం టీమిండియా ఆటగాళ్లతో ఒక వీడియో షూట్ చేశారు. ‘బిలియన్ చీర్స్ జెర్సీ’గా దానికి పేరు కూడా పెట్టారు. కాగా ఈ జెర్సీ షూట్ సమయంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, బూమ్రా తెగ అల్లరి చేశారు.
జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫుల్ హ్యాపీగా కనిపించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల సందడిని వీడియో తీశారు. ఆ వీడియోను బీసీసీఐ శుక్రవారం తన అధికారక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం టీమిండియా ఆటగాళ్లు గోలగోల చేసిన ఆ వీడియోను మీరూ చూసేయండి.
A bit of shooting fun with the boys to make your day brighter 😍
Team India in the #BillionCheersJersey is a vibe! #ShowYourGame @mpl_sport pic.twitter.com/8MnycPSKer
— BCCI (@BCCI) October 22, 2021