పరీక్షలు మాత్రమే జీవితం.. కాదు ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు.. ఓడిపోతేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఇలాంటి డైలాగ్లు సినిమాల్లో, పుస్తకాల్లో, పెద్దల నోట వింటూనే ఉంటాం. కానీ నిజ జీవితంలో పాటించే వారు మాత్రం చాలా కొద్ది మందే వీటిని ఫాలో అవుతుంటారు. తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల తర్వాత ఫెయిల్ అయ్యామనే బాధతో పలువురు విద్యార్థులు ప్రాణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..
తమిళనాడు నీలగిరికు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసింది. సెప్టెంబర్లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి బాలిక డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆమె పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు.. ఇలానే ఉంటే ప్రమాదం అని భావించి బాలికను తిరుపూర్ జిల్లాలోని బంధువుల ఇంటికి పంపారు. అక్కడ కొన్ని వారాలు గడిపిన బాలిక.. దీపావళి సందర్బంగా ఇంటికి తిరిగి వచ్చింది.
ఇది కూడా చదవండి : Inspiration: పూరి గుడిసెలో వికసించిన విద్యాకుసుమం!
బంధువుల ఇంటి నుంచి వచ్చిన తర్వాత బాలిక అంతకుముందులానే సంతోషంగా ఉండసాగింది. ఆమె పరిస్థితిలో మార్పు వచ్చిందని భావించిన కుటుంబ సభ్యులు సంతోషించారు. అందరూ ఇలా భావిస్తున్న తరుణంలో ఆత్మహత్య చేసుకుని తీవ్ర విషాదం మిగిల్చింది బాలిక. ఆమె రాసిన లేఖ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది.
‘‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి.. మీ కలల్ని నేను నిజం చేయలేకపోయాను. నీట్లో ఫెయిల్ అయినందుకు మీరు నన్ను ఏం అనలేదు. కానీ నేను తట్టుకులేకపోతున్నాను. మీ ఆనందం కోసం అన్ని మర్చిపోయినట్లు నటిస్తున్నారు. కానీ ఇంక నా వల్ల కాదు.. ప్రతి రోజు ఇలా నటించడం నా వ్లల కాదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’’ అని లేఖలో రాసింది.
ఇది కూడా చదవండి : భర్త నోట ఆ మాట.. తట్టుకోలేకపోయిన ఆ మహిళ షాకింగ్ నిర్ణయం