సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నటి పూర్ణ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది. సౌత్‌లో అన్ని భాషల్లో కలిపి సుమారు 40 వరకు సినిమాలు చేసింది పూర్ణ. అయినా ఈమెకు సరైన విజయాలు దక్కలేదు. ప్రస్తుతం బుల్లి తెర మీద షోలు చేస్తూ.. సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతుంది. కొన్ని రోజుల క్రితమే పూర్ణ నిశ్చితార్థం జరిగింది. ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రస్తుతం పూర్ణ వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పూర్ణపై జబర్దస్త్ కమెడియన్లు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌కు పూర్ణ జడ్జీగా వచ్చింది. ఈ క్రమంలో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ పూర్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. షోలో భాగంగా ఆది పూర్ణను ఉద్దేశిస్తూ.. ఏంటి నాలుగు ఎపిసోడ్‌లకు గ్యాప్ ఇచ్చారు.. అని ప్రశ్నిస్తాడు. అందుకు వెంటనే రామ్ ప్రసాద్ స్పందిస్తూ.. మీరు లేనప్పుడే షో బాగుంది. ఆ గ్యాప్‌ను కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అని నోరు జారాడు. దాంతో పక్కనే ఉన్న పూర్ణ.. మోచేత్తో రామ్ ప్రసాద్ కపుపులో ఒక్కటిస్తుంది. మొత్తానికి పూర్ణపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.