ఎన్నికలు గురించి మాట్లాడటానికి నాగబాబుకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోట. ప్రకాష్ రాజ్ మంచి నటుడై. ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్పితే మా ఎన్నికల్ని ఎవరు ప్రకటించారనీ, ఇప్పుడున్న కమిటీ ప్రకటించకుండా వీళ్లు హడావిడి ఏంటి? ఈ ఇష్యూలో నాగబాబు ఎందుకు హడావిడి చేస్తున్నారనీ ప్రశ్నించారు ఆయనకు ఎందుకు ఈ ఇష్యూ మరి చిరంజీవి గారు మద్దతు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ, ప్రకాష్ రాజ్ గారు మాత్రం తనకు చిరంజీవి గారి మద్దతు ఉంది అని చెప్తారు. మద్దతు ఉంటే ఉండొచ్చు. కానీ దీనిపై నాగబాబు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలి. ప్రకాష్ రాజ్ అనే కాదు మిగిలిన వాళ్లు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు. గతంలో పరాయి భాష నటులకు, ప్రత్యేకించి విలన్లకు తెలుగు సినిమాల్లో అవకాశం ఇవ్వడాన్ని కోట ఆక్షేపించారు. వారికి నటన రాకపోయినా ఛాన్సులు ఇస్తున్నారంటూ కోట ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే.
నేను కూడా దీనిపై మాట్లాడకూడదనే అనుకున్నా కానీ ఈ కరోనా టైంలో ఈ గోల ఎందుకు పెడుతున్నారనేదే బాధ. ఎన్నికలు అంటూ ప్రకటనలు ఇచ్చిన ప్రకాష్ రాజ్ గారికి ఈ మాత్రం తెలియదా? జయసుధ సపోర్ట్ చేసిందని ఆమెకు ఫోన్ చేసి అడిగినట్లు చెప్పారు. సాయి కుమార్ బీజేపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి. అలాంటిది ప్రకాష్ రాజ్‌ని ఎలా సపోర్ట్ చేస్తారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఎప్పటి నుంచో బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా కాబట్టి అంటూ వ్యాఖ్యలు చేశారు కోటా శ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోట.