చిన్నారులకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. వాటికన్ సిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వారి బంధువులతో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. అకస్మాత్తుగా స్పైడర్ మ్యాన్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. స్పైడర్ మ్యాన్ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ‘మాటియో విల్లార్డిటా’ స్పైడర్ మ్యాన్ వేషధారణలో రావడం జరిగిందన్నాడు. ఇతనితో చిన్నారులు సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. అనంతరం వాటికన్ సిటీలో ఉన్న పోప్ ప్రాన్సిస్ ను కలిశాడు.
తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్ ను పోప్ కు ఇచ్చారు మాటియో. చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్‌ని కోరినట్లు మాటియో తెలిపారు.