ప్రస్తుత కాలంలో ఏదైన జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే.. జేబు మెుత్తం ఖాళీ చేసుకోవాల్సిందే. ఇలాంటి స్థితిలో పేదలకు వరంలా ఒక చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది. పేదలకు కేవలం ఒక రూపాయితో వైద్యం అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రస్తుత కాలంలో ఏదైన జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే.. జేబు మెుత్తం ఖాళీ చేసుకోవాల్సిందే.. అసలు డాక్టర్ ను సంప్రదించడం నుంచి మెుదలు పెడితే ఆ టెస్ట్ లకే.. చాలా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. ఇంకా ప్రభుత్వ దవాఖానాలు అంటారా..వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ఇంకా మన ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందడం లేదు. ఇలాంటి స్థితిలో పేదలకు వరంలా ఒక చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది. పేదలకు కేవలం ఒక రూపాయితో వైద్యం అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
రాంనగర్ లోని జీజీ చారిటబుల్ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే .. ఇప్పుడున్న పరిస్థితులలో కనీసం ఒక్క రూపాయితో.. ఎలాంటి పని జరగడడం లేదు. టీ కాదు కదా.. కనీసం చాక్లెట్ కూడా రావడం లేదు. ఇప్పటి వరకు ఎన్నో వైద్య సేవలను రూపాయికే అందించిన ఈ ట్రస్ట్.. హార్ట్ ఆపరేషన్ కోసం కేవలం ఒక్క రూపాయిని మాత్రమే ఫీజు చెల్లిస్తుంది. పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో కేవలం ఒక్క రూపాయికే 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు ఈ చారిటబుల్ సంస్ట చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు.అలాగే ఇక్కడ జరిగే వైద్య సేవలు అన్ని పైడి రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ పౌండేషన్ ద్వారానే ఇటీవలే ఎవరయితే గుండె ఆపరేషన్ చేయించుకున్నారో.. ఆ భాదితుల కుటుంబ సభ్యులు గంగాధర్ గుప్తాకు, రాకేశ్ రెడ్డీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇలా ఎంతోమంది పేదలకు రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్యం, విద్య ఉచితంగా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యం చేయించుకున్న భాదితులు రాకేష్ రెడ్డి మనసు వెన్నలాంటిది. ఈ సమాజానికి ఎలాగైనా ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో బలహీనంగా ఉన్నవాళ్లకి అన్ని విధాలుగా సహాయపడాలనే ఉద్దేశ్యంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని అన్నారు. “కేవలం ఈ చారిటబుల్ ట్రస్ట్ లు హైదరాబాద్ లోనే కాకుండా తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ లో కూడా ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టాలని,,ఏదో ఓకరకంగా అయితే పేదవాళ్లకి సాయపడాలనేది నా ముఖ్య ఉద్దేశ్యం.. ఇంకా మాకు అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వాదాలు ఉంటే భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతాం”. అని పైడి రాకేష్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. మొత్తానికి పేదలకోసం తీసుకున్న ఈ మంచి నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.