టాలీవుడ్ క్యూట్ కపుల్ లిస్ట్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య జంట కూడా ఒకటి. గత డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన వివాహంతో వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి ఈ కొత్త జంట తెగ ఎంజాయ్ చేస్తూ.., ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.., ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక నటనని కొనసాగిస్తుండటంతో.. ఆమెని అర్ధం చేసుకునే భర్త దొరికాడని అంతా అనుకున్నారు. కానీ.., తాజాగా నిహారిక ఇంట్లో పెద్ద రచ్చ జరగడంతో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త కూడా అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.., అసలు అర్ధరాత్రి జరిగిన గొడవ ఏమిటన్న విషయంలో క్లారిటీ రాక.., మెగా ఫ్యాన్స్ తెగ హైరానా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో గొడవకి సంబంధించిన అసలు నిజాలు ఇప్పుడు బయటకి వచ్చాయి.
పెళ్లి అయ్యాక జొన్నలగడ్డ చైతన్య బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అయితే.., ఇప్పుడు నిహ, చైతన్య బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఆఫీస్ ఓపెన్ చేశారట. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఆఫీస్ పెట్టడాన్ని అపార్టుమెంట్ వాసులు కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తూ వస్తున్నారట. ఈ విషయం మీదే గత రాత్రి నైబర్స్, చైతన్య మధ్య గొడవ జరిగిందట.
గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని… వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్టుమెంట్‌వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ., చైతన్య మాత్రం ఆ వాదనని ఖండించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఇరువర్గాలకి కౌన్సెలింగ్ ఇచ్చి.., రాజీకి వచ్చేలా చేశారని తెలుస్తోంది. ఏదేమైనా.. ఓ చిన్న గొడవ ఇలా అనుకోకుండా పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ ఛైతన్య వార్తల్లో నిలవాల్సి వచ్చింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.