సమాజంలో ప్రేమ పేరుతో మోసం చేసే వారు పెరిగిపోతున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ అమ్మాయి ప్రేమ పేరుతో మోసగాడు వేసిన వలలో చిక్కి, తన సర్వస్వం వాడికి అర్పించింది. చివరికి అతడగాడు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో మనస్తాపం చెంది.. ఆ యువతి జీవితాన్ని మధ్య లోనే ముగించింది. సివిల్ సర్వీస్ చేయాల్సిన యువతి ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని రామనాథపురంలో సౌమ్య అనే యువతి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అబూ అలియాస్ షేక్ మహ్మద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అబూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఇలా.. కొన్నాళ్లు గడిచాక పెళ్లి చేసుకుందామని సౌమ్య ఇటీవల చెప్పగానే అబూ పెళ్లికి అంగీకరించలేదు.దీంతో.. సౌమ్య తీవ్ర మనస్తాపం చెందింది. పెళ్లి చేసుకోమని అబూని చాలా సార్లు బతిమాలింది సౌమ్య. అయినా.. అతడు సౌమ్యను పట్టించుకోలేదు.
ఒకవైపు ప్రేమించిన వాడు పెళ్లికి ఒప్పుకోకపోవడం, మరోవైపు సివిల్స్‌కు సరిగ్గా ప్రిపేర్ కాలేక పోవటంతో సౌమ్య ఎంతగానో తనలోతానే మదనపడింది. చివరికి క్షణికావేశంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి మునియస్వామి ఫిర్యాదుతో రామనాథపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివిల్ సర్వీస్ కు వెళ్లి దేశానికి సేవ చేయాల్సిన ఓ యువతి ఇలా ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడం అందరని కలచివేస్తోంది. ఇలా ప్రేమ పేరుతో జరిగే మోసాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.