ఈ వీడియోలో దృశ్యాలు మిమ్మల్ని గగుర్పాటుకు గురి చేయవచ్చు. భార్యను ఓ భర్త అతికిరాతంకగా పొడుస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. నడి రోడ్డుపై జనాలు తిరుగుతుండగానే ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటుచేసుకోంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ వీడియో.. భర్త పైశాచికత్వం ఉలిక్కి పడేలా చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పునీత ప్రైవేట్ షూ కంపెనీలో పనిచేస్తుంది. సోమవారం రాత్రి ఇంటికి వెళుతుండగా, ఓ చోట నిలబడింది. అక్కడకు వచ్చిన ఆమె భర్త జై శంకర్ తొలుత ఆమెను కొట్టగా.. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై పలు మార్లు దాడి చేశాడు. పునీత తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించింది. నడి రోడ్డుపై ఈ ఘటన జరుగుతున్నా ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఏడుసార్లు కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు జై శంకర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఓ మహిళ, మరికొంత మంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన ఆమెను అంబూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా , నిందితుడు జై శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.
(Warning! disturbing images) Man Stabs Wife To Death On Busy Road In Tamil Nadu; Arrested. Horrific Act Caught On CCTV #VelloreStabbing pic.twitter.com/nWWuK6J9TO
— India.com (@indiacom) January 24, 2023