మహరాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం అహ్మద్‌నగర్ జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఆ అగ్నిప్రమాదంలో ఆరుగురు కొవిడ్ రోగులు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో మరో 11 మంది రోగులు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ఐసీయూలో మొత్తం 17 మంది రోగులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకునన్న వెను వెంటనే అగ్నిమాక సిబ్బంది, పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదం ఎలా జరిగింది? కారణాలు ఏంటనే విషయంపై స్పష్టత రాలేదు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవిచింది.