Mohanbabu: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తాజాగా, భేటీ అయ్యారు. మోహన్‌బాబు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలవటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా భేటీలో ఏపీ రాజకీయ పరిణామాలపై ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ రెండు గంటలకు పైగా సాగినట్లు సమాచారం.
కాగా, శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సం, మోహన్ బాబు జన్మదినోత్సవ వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ ఏదో సాధించాలనే పట్టుదలతో చిత్తూరు నుంచి మద్రాసు వెళ్లాను. జీవితం మొత్తం కష్టాలమయం. వేసుకోవడానికి చెప్పుల్లేక, తినడానికి తిండిలేక, కేవలం రెండు జతల బట్టలతోనే ఏడేళ్లు గడిపాను. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసరి నారాయణరావు నన్ను వెండితెరకు పరిచయం చేశారు. తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. నిర్మాతగా ఎదిగాను. జీవితంలో ఎన్నో జయాపజయాలు చవి చూశాను. నా జీవితం ప్రతిరోజూ ముళ్ల బాటలా ఉండేది.
నేను అనుభవించిన కష్టాలు ఎదుటివారికి రాకూడదని భావిస్తుంటాను. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే శ్రీ విద్యానికేతన్ స్థాపించాం. ఇక్కడ కులమతాలకు అతీతంగా 25 శాతం మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. నేను ఇతరులకు ఎంతో ఉపయోగిపడినా.. నాకు ఏ ఒక్కరూ ఉపయోగపడలేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు నాతో ప్రచారం చేయించుకున్నారు. వాళ్ల సాయం నాకు ఎప్పటికీ ఉండదు. నేను వాళ్లను సాయం అడగను కూడా. జీవితం నాకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. జీవితంలో ఎన్నోసార్లు మోసపోయాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, చంద్రబాబుతో మోహన్ బాబు భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: YS Jagan Mohan Reddy: ఈ బుడ్డోడు మహా ఘటికుడు! ఏకంగా సీఎం జగన్ జోబిలోంచి పెన్ను లాగేశాడు