మద్యం.. ఈ ఒక్క అలవాటుతో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏదైనా లిమిట్ దాటితే అనర్థాలు తప్పవు అనడానికి మద్యపానాన్ని ఉదాహరణగా చూపించవచ్చు. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే నినాదంతో ఎన్నికల్లో గెలవడం చూశాం. అయితే మద్యపానాన్ని నిషేధించేందుకు ప్రభుత్వాలు ధైర్యం చేయవు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి అయినా.. ఎక్కువగా ఆదాయం వచ్చేది ఆబ్కారీ శాఖ నుంచే అని అందరికీ తెలిసు. కానీ, పైకి మాత్రం మద్యపాన నిషేధం అంటూ మాటలు చెబుతుంటారు.
కానీ, ఓ ప్రభుత్వం మాత్రం బాహాటంగానే యువతను మందు తాగాలని కోరుతోంది. మందు తాగకపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతోందని గగ్గోలు పెడుతోంది. అంతేకాదు యువతను మందు తాగేలా ప్రోత్సహించేందుకు కొత్త ఐడియాలు కావాలంటూ పిలుపునిచ్చింది. 25-39 ఏళ్ల వయసు మధ్యలో ఉండేవారికి ఓ కాంపిటీషన్ కూడా పెట్టింది. అయితే ఇదంతా జరిగింది భారత్ లో కాదులెండి.. జపాన్ ప్రభుత్వం ఆదాయం కోసం ఇలాంటి ప్రకటనలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..
Japan tries to boost alcohol consumption: Japan’s National Tax Agency has launched a nationwide competition to devise new ways to encourage young people to drink more alcohol after tax revenues from alcohol shrunk to their lowest level in decades.#Japan… https://t.co/q5qYlPXiof pic.twitter.com/y2VqMnWnBC
— Graphic News (@GNgraphicnews) August 18, 2022
జపాన్ లో 1995తో పోలిస్తే 2020 కల్లా మద్యం వినియోగం తగ్గిపోయింది. 1995లో ఏటా ఒక వ్యక్తి సగటున 100 లీటర్ల మద్యం తాగితే.. 2020 కల్లా మద్యం వినియోగం 75 లీటర్లకు పడిపోయింది. దాంతో ఆదాయం తగ్గుతోందంటూ జపాన్ ప్రభుత్వం తెగ ఫీలైపోతోంది. ‘యువతీ యువకుల్లారా అవర్ సిన్సియర్ రిక్వెస్ట్.. మీకు నచ్చిన బ్రాండ్ సెలక్ట్ చేసుకుని రెండు పెగ్గులు అయినా తాగండి’ అంటూ బతిమాలుతోందట.
The government of Japan is encouraging its youth to drink more by launching a nationwide competition. The younger generation of the country drinks less alcohol than their parents- a move that has hit taxes on beverages like sake .#Japan #alcohol pic.twitter.com/2UVCGutrBP
— Asiana Times (@AsianaTimes) August 18, 2022
2019వ సంవత్సరంతో పోలిస్తే.. 2020లో జపాన్‌లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ ప్రభుత్వానికి 110 బిలియన్ యెన్ల( దాదాపు రూ.6,419 కోట్లు) మేర ఆదాయం తగ్గింది. గడిచిన 31 ఏళ్లలో అదే అతిపెద్ద తగ్గుదల కావడంతో జపాన్ ప్రభుత్వం కలవర పడింది. అయితే ఎక్కడ సమస్య ఏర్పడిందా అని అధ్యయనాలు చేయించింది. విషయం ఏం తేలిందంటే.. కరోనా తర్వాత యువత బొత్తిగా మందు జోలికి వెళ్లడం లేదంట.
⚡️#Japan announces nationwide ‘drinking’ competition after its #alcohol’s contribution to the GDP records lowest
👉🏻 1980 – 5%
👉🏻 2022 – 1.7%Japan Govt. wants the youngsters to drink more often & also wants to come up with ideas that popularise drinking
— Hillol J. Deka (@HillolDeka) August 18, 2022
ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడం, కరోనా వల్ల భయం మొదలవడం కారణం ఏదైనా.. యువత మాత్రం మద్యం ముట్టుకోవడం లేదంట. అందుకే యువతను మద్యంవైపు ప్రోత్సహించేలా కొత్త ఐడియాల కోసం ఓ కాంపిటీషన్ పెట్టింది. ‘సేక్ వివా’ పేరిట నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ ఓ పోటీని నిర్వహిస్తోంది. ఆ పోటీలో 20 నుంచి 39 ఏళ్ల వయసున్న యువకులు పాల్గొనవచ్చు. అయితే యువతను ఎలా మందుబాబులను చేయాలో వాళ్లు సలహాలు, కొత్త ఐడియాలు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9 దాకా ఈ పోటీని నిర్వహించనున్నారు.
Shayooooooo🍺🍺
Japan’s government has launched a competition to find innovative ways to convince young people to drink more alcohol after a change in attitudes resulted in a dip in tax revenues.#263Chat pic.twitter.com/4zpo48Z85C
— 263Chat.com 🇿🇼 (@263Chat) August 19, 2022
నవంబర్ లో టోక్యోలో ఫైనల్ రౌండ్ ఉంటుంది. అందులో గెలిచిన వ్యక్తి మద్యం పెంపునకు చేసిన ఆలోచనను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయం అందజేస్తుందని తెలిపారు. కుచించుకుపోతున్న మద్యం మార్కెట్‌ను యువత మందు అలవాటు చేసుకుని జీవి పోయాలని పిలుపునిస్తోంది. జపాన్ చేసిన ఈ పనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. ఇదేం దిక్కుమాలిన పని అంటూ తిట్టిపోస్తున్నారు. ఆదాయం కోసం యువతను బలిపశువులను చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జపాన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Japan tells citizens to bottoms up!
Japan is telling its citizens to drink more alcohol. The Japanese government has launched a nationwide competition.@Mohammed11Saleh tells you more
Watch more: https://t.co/AXC5qRuO3J pic.twitter.com/lojuhhmNy4
— WION (@WIONews) August 18, 2022