న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డ్‌పై స్పందించిన పఠాన్ ‘భారతీయులు వేరే దేశాలకు వెళ్లనివ్వద్దని, వెళ్లమని చెప్పకపోవడం ఉత్తమమని’ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. దానికి కారణం అజాజ్ పటేల్ భారతీయ సంతతికి చెందిన వాడే కావడం కారణమయి ఉండొచ్చు. ముంబైలో పుట్టిన అజాజ్ న్యూజిలాండ్‌లో స్థిరపడి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు మన దేశంపైనే ఈ రికార్డు నెలకొల్పాడు.
అజాజ్ లాంటి వాళ్లును న్యూజిలాండ్ వెళ్లనియ్యకుండా ఉండి ఉండే టీమిండియాకు ఇలాంటి టాలెండెట్ క్రికెటర్ దొరికేవాడని పఠాన్ ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ.. ఈ వ్యాఖ్యలపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజాజ్ రికార్డ్‌పై స్పందిస్తూ.. అతి సున్నితమైన మత వివక్షపై పఠాన్ స్పందించినట్లు కనిపిస్తుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఒక వర్గవారిపై ‘దేశం విడిచి పోండి’ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. దీనిపై కౌంటర్‌గానే పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడనే భావిస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి పఠాన్ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Please don’t let any Indian go to any other country, best don’t even ask them. Dus ka dum 😳 #AjazPatel
— Irfan Pathan (@IrfanPathan) December 4, 2021
you could have celebrated ajaz patel’s achievement without bringing religion politics.
— harsh trivedi (@harshtrivedi95) December 4, 2021