పేగు బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేము. అందుకే కడుపున పుట్టిన బిడ్డలకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి తల్లిదండ్రులు తమ జీవిత కాలం కష్టపడుతుంటారు. అలాంటిది బిడ్డల ప్రాణాల మీదకి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఓ నిరుపేద తండ్రి ఇలానే తన బిడ్డలని బతికించుకోవడానికి.. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లో రవి అనే సినీ కార్మికుడు నివాసం ఉంటున్నాడు. సంపాదన తక్కువే అయినా, నచ్చిన వృత్తిలో ఆనందాన్ని వెతుక్కుంటూ.. రవి, అతని భార్య జీవిస్తూ వస్తున్నారు. అయితే.. రవి భార్య గర్భం దాల్చడంతో ఆమెకి ఈ డిసెంబర్ సమయానికి డాక్టర్స్ డెలివిరి డేట్ ఇచ్చారు. అయితే.., సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో పెద్ద కుదుపులా.. రవి భార్యకి అప్పుడే డెలివిరి అయిపోయింది.
ఆమె 6వ నెలలలోనే ఇద్దరు మగ పిల్లలకి జన్మనిచ్చింది. పిల్లలు ఇద్దరికి మిగతా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా, ఆరు నెలల ఆ బిడ్డలని ఇంక్యుబేటర్ లో పెట్టాల్సి వచ్చింది. కనీసం మరో రెండు నెలల కాలం అయినా పిల్లలని ఇంక్యుబేటర్ లో పెట్టాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అందించడానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు కానుంది. ఇంతటి ఆర్ధిక శక్తి తన దగ్గర లేక.., ఆ పేద తండ్రి తన బిడ్డలను కాపాడమని దాతలను వేడుకుంటున్నారు.
బిడ్డల తండ్రి రవి అకౌంట్ డీటైల్స్
google pay, phone pay
konda ravi
9391182287
Bank-STATE BANK OF INDIA
AC NO-64039046886
Name-KONDA RAVI
IFSC CODE-SBIN0008022
BRANCH-BANJARAHILLS, ROAD-5
BRANCH