ఈ మధ్య చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంటుంది.
రైల్వే శాఖలో పనిచేస్తున్న రైల్వే పోలీసులు ప్రమాదాల నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. రైలు ప్రమాదాల నుంచి ప్రయాణికులను కాపాడుతూ ఆర్పీఎఫ్ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తారు. రైల్వే స్టేషన్లలో నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత కల్పిస్తారు. ఇదే విధంగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో సకాలంలో స్పందించి ఓ ప్రమాదాన్ని తప్పించాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేసిన సాహసోపేతమైన చర్యకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఏం చేశాడు? అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చెన్నైకు బయలుదేరింది. తిరుపతికి సమీపంలో ట్రైన్ ప్రయాణిస్తోంది. అయితే జనరల్ బోగీలోని ఓ ప్రయాణికుడు అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే చైన్ లాగాడు. దీంతో ట్రైన్ ఓ నది వంతెనపై నిలిచిపోయింది. ట్రైన్ ఎందుకు ఆగిందోనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాగా అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న చెన్నై డివిజన్ కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిందికి దిగి లోకోపైలట్ సహాయంతో చైన్ లాగిన బోగిని గుర్తించారు.
కానీ ఆ బోగీ బ్రిడ్జిపై ఉండడంతో అందులోకి వెళ్లడానికి వీలు పడలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా సమీపంలో జెసిబి ఎక్స్‌కవేటర్ కనిపించింది. అక్కడికి వెళ్లి జెసిబి ఆపరేటర్ కు జరిగిన విషయం చెప్పారు. వెంటనే జెసిబి ఎక్స్‌కవేటర్ తీసుకుని రైలు వద్దకు వచ్చి కానిస్టేబుల్ జెసిబి బకెట్ లో నిల్చోని ఆ బోగిలోకి వెళ్లాడు. అలారం చైన్, వాల్వ్ ను సరిచేసి రైలు ముందుకు కదిలేలా చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంతటి సాహసం చేసిన కానిస్టేబుల్ ను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.
When a passenger of General Coach pulled the alarm chain of this train no. 12604 Exp (HYB -MAS) on 27.06.2023, the train stopped over Bridge no.167. It wasn’t possible to reach the coach for resetting Alarm Chain Resetting Valve. #IndianRailways #dedication pic.twitter.com/JXK2bJGqXr
— DRM Chennai (@DrmChennai) June 28, 2023